గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:22 IST)

నా గ్రాఫ్ బాగుంది : మొత్తం 175 స్థానాలు ఎందుకు గెలవలేం : సీఎం జగన్ ప్రశ్న

ys jagan
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో మంత్రులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలవడమే లక్ష్యంగా వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. 
 
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, "నాదిగాని, నా ప్రభుత్వ పనితీరు సూపర్బ్‌గా ఉంది. కొందరు ఎమ్మెల్యే గ్రాఫ్ కూడా ఫర్వాలేదు. ఇంకొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం ఏమాత్రం బాగోలేదు. వీళ్లకు ఆరు నెలలు, తొమ్మిది నెలలు సమయం ఇస్తున్నా. ఆలోగా వారు ప్రజల్లో పర్యటించి గ్రాఫ్ పెంచుకోవాలని మీరు వివరించండి" అని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు ఆదేశించారు. 
 
ఈ సమయంలో పనితీరును మార్చుకోని, ఓడిపోయే ఎమ్మెల్యేలను పార్టీకి బరువుగా సీఎం జగన్ అభివర్ణించారు. ఓడిపోయే ఎమ్మెల్యేల బరువు మోయలేను. వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదన్నారు. అధికారంలోనికి వచ్చాక వారికి ఎమ్మెల్సీలు లేదా నామినేటెడ్ పదవులు ఇస్తా" అని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఇపుడున్న 151 స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదని చెబుతూనే. కరోనా కష్టకాలంలోనూ అనేక సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం... మొత్తం 175 స్థానాలు ఎందుకు గెలవలేం" అని ఆయన పార్టీ నేతలను ప్రశ్నించారు.