1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:02 IST)

ఆంధ్రప్రదేశ్‌లో "ఆచార్య" సినిమా టిక్కెట్ ధరలు ఇవే...

Acharya
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. మెగా తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా 29వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ధరలను ఖరారు చేసింది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత పది రోజుల పాటు నాన్ ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలపైనా రూ.50 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఆ సినిమా కనీస టికెట్ ధర రూ.70కి చేరుకుంది. అలాగే, మల్టీప్లెక్స్‌లలో గరిష్ఠంగా రూ.300 చేరుకుంది. 
 
కాగా, మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేదలకు సినిమా వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ఆదేశించింది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు నాన్  ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలకు ఒకేలా ధరలు పెంచుకోవచ్చని పేర్కొంది. 
 
కాగా, ఇటీవల విడుదలైన "రాధేశ్యామ్", "ఆర్ఆర్ఆర్" సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు విడుదల చేసిన పవన్ కల్యాణ్ సినిమా "భీమ్లానాయక్" సినిమాకు మాత్రం ఇలాంటి అవకాశం లేకుండాపోయింది.