శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (15:57 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాసెట్ 2022 నోటిఫికేషన్ జారీ

students
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాసెట్ 2022 నోటిఫికేషన్ జారీచేశారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి మే 13వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/lawcet లో జూన్ 13వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అపరాధ రుసం రూ.500తో జూన్ 20వ తేదీ వరకు, రూ.1000 అపరాధ రుసుంతో జూన్ 27వ తేదీ వరకు రూ.2 వేల అపరాధ రుసుంతో జూలై 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 
 
ఇక ఏపీఎడ్‌సెట్‌కు మే 9వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసం రూ.1000తో జూన్ 15, అపరాధ రుసం రూ.2 వేలుతో జూన్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈపీఈసెట్‌కు మే 3 నుంచి జూన్ 3 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుం రూ.500తో జూన్ 13వ తేదీ వరకు, రూ.2 వేలతో జూన్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు పీజీఈసెంట్, ఐసెట్‌లకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీచేయనున్నారు.