బాబుతో నేను.. అంటూ రాజమండ్రి జైలుకు వేలాది ఉత్తరాలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుకుడు మద్దతుగా అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ కంపెనీల ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా బాబుతో నేను అంటూ వేలల్లో పోస్టు కార్డులను పంపుతున్నారు. గత నాలుగు రోజులుగా రాజమండ్రి జైలుకు టీడీపీ, చంద్రబాబు నాయుడు అభిమానులు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. ఇలా జైలుకు వస్తున్న ఉత్తరాలు వేలకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుకార్డు ఉద్యమం సాగుతున్నట్టుగా కనిపిస్తుంది.
టీడీపీ చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి జైలుకు నాలుగు రోజులుగా వేలల్లో ఉత్తరాలు వస్తున్నాయి. బాబుతో నేను అంటూ ప్రజలు పోస్టుకార్డులు రాసి పంపుతున్నారు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్‌లతో పాటు ఆర్డినరీ పోస్టులు నిత్యం వేలాదిగా వస్తుండటంతో జైలు అధికారులు కూడా తలలు పట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కావడంలేదు.