Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అమరావతి కోసం పోస్టుకార్డు ఉద్యమం

Written By ఎం
Updated: శుక్రవారం, 3 జనవరి 2020 (05:24 IST)
అమరావతి రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని, కోరుతూ గత 16 రోజులుగా రైతులు, ప్రజలు, చేస్తున్న ఆందోళనకు, ధర్నాలకు, మద్దతుగా, మండల కేంద్రమైన, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో ప్రతిభ హై స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు  పోస్టుకార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి కి పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు, పాతర్ల రమేష్, నూతక్కి ఏడుకొండలు మాట్లాడుతూ, అమరావతి రాజధాని ఇక్కడే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, వారు కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు.

అమరావతి ఈ ప్రాంతంలోని రైతాంగాన్ని ప్రజలను కాపాడాలని, వారు రాష్ట్రపతి,ని కోరారు. రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని మారిస్తే, ప్రజలు చూస్తూ ఊరుకోరని వారన్నారు. రాజధానిని మార్చడానికి చట్టబద్ధత లేదని వారు అన్నారు,మహిళలు రైతులు ఈ విధంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేయడం, చరిత్రలో ఏనాడు చూడలేదన్నారు. 
 
రాజధాని ఇక్కడే కొనసాగించాలని సెవ్ ఆంధ్రప్రదేశ్, సెవ్ రాజధాని, అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు పాతర్లరమేష్, నూతక్కి ఏడుకొండలు, జిల్లా బిసి చాగంటిపాటి పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు కాజా లక్ష్మీప్రసాద్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments