శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (18:42 IST)

తిరుమలలో ప్రి-వెడ్డింగ్ షూట్ చేసామా? ఆపండి మీ చెత్త రాతలు: దివ్వల మాధురి (Video)

Duvvada Srinu- Madhuri
తమ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని వస్తే... అక్కడ తామేదో ప్రి-వెడ్డింగ్ షూట్ చేసామంటూ చెత్త రాతలు రాస్తున్నారంటూ మండిపడ్డారు దివ్వెల మాధురి. ఆదివారం నాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావుతో కలిసి ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు మాడ వీధుల్లో తిరిగారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
 
దీనిపై కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు చెత్త రాతలు రాశాయని మాధురి తప్పుబట్టారు. తిరుమల వెంకన్న సన్నిధికి తాము వస్తే దాన్ని మరో రకంగా మార్చి చెపుతూ తప్పుడు రాతలు రాసి ప్రసారం చేస్తున్నాయనీ, ఈ రాతలను వెనక్కి తీసుకోకపోతే ఆ మీడియా ఛానల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు.
 
దువ్వాడతోనే శేష జీవితం
ఇకపై తన శేషజీవితాన్ని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే గడుపుతానని డ్యాన్స్ టీచర్ మాధురి అంటున్నారు. ఆమె సోమవారం దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రతియేటా బ్ర‌హ్మోత్సవాల‌కు తిరుమ‌ల‌ వ‌స్తానని, గ‌తంలో నా డ్యాన్స్ టీమ్‌తో మాడ‌వీధుల్లో ప్రోగ్రామ్స్ చేయించినట్టు చెప్పారు. ఇక‌పై దువ్వాడ శ్రీ‌నివాస్‌తోనే క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను, అందుకే ఇద్ద‌రం క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకున్నట్టు చెప్పారు. తన శేషజీవితం దువ్వాడ శ్రీనివాస్‌తోనే అని చెప్పారు. 
 
ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, తన ఆస్తుల‌న్నీ భార్యాపిల్ల‌ల‌కు రాసేశాను.. అయినా పిల్ల‌ల బాధ్య‌త తన మీద ఉందన్నారు. ఎన్నిక‌ల్లో తన కోసం మాధురి కొంత న‌గదు ఖ‌ర్చు చేశారనీ, అందుకే కొంత ఆస్తి ఆమె పేర రాసినట్టు చెప్పారు. ఈ గొడ‌వ‌ల వ‌ల్ల‌ మాధురికి కూడా అన్యాయం జ‌రిగింది.. అందుకే ఆమెకు తాను అండ‌గా ఉన్నట్టు చెప్పారు.