గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (13:27 IST)

ప్రీవెడ్డింగ్ షూట్ పేరుతో లిప్ లాక్ కిస్సులు... ఇది పోర్న్ వీడియో అంటూ నెటిజన్ల ఫైర్ (Video)

prewedding shoot
సంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయి. ప్రీవెడ్డింగ్ పేరుతో యువతీయువకులు హద్దులుదాటిపోతున్నారు. పైగా, తమ చేష్టలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ప్రీవెడ్డింగ్ షూట్ పేరుతో కాబోయే వరుడు, వధువు హద్దులుదాటారు. ఈ వీడియోలోని జంట అధర చుంబనాల్లో మునిగిపోయింది. అదికూడా క్షణకాలం కనిపించడం కాదు... ఏకంగా 21 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నాలుగైదుసార్లు వారు తమకంలో అలా చుంబించుకోవడం కనిపించింది. 
 
సనాతన భారతీయ సంస్కృతీపై ఇలాంటి ప్రీవెడ్డింగ్ షూట్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. మరీ ముఖ్యంగా, చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంతమాత్రం సరికాదని, ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు  భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి విడమరిచి చెప్పాలని నెటిజన్లు కోరుతున్నాు. అసలు ఇలాంటి లిప్‌లాక్ కిస్ షూట్‌కు అనుమతించిన తల్లిదండ్రులను దూషించాలని మరికొందరు మండిపడుతున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్ పేరుతో పోర్న్ వీడియోలు చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విడియోకు ఇప్పటికే 1.4 మిలియన్ వ్యూస్ రాగా, నెటిజన్లు కామెంట్స్‌కు మాత్రం లెక్కలేదు.