మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (14:54 IST)

Priest Break Dance : వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్‌లు (video)

Srikakulam
Srikakulam
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథయాత్ర నిర్వహించారు అర్చకులు. గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 23 తేదీ రాత్రి వరకు నిర్వహించడం జరిగింది. 
 
ఈ ఉత్సవాల్లో భక్తి, భజనలకు బదులుగా మాస్ పాటలు ప్లే చేయడం.. వాటికి పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు చేయడం వివాదాస్పదమవుతోంది. ఆలయంలో వుండే పూజారులే ఈ విధంగా భగవంతుడి పట్ల, భక్తి కార్యక్రమాల పట్ల ప్రవర్తిస్తే ఎలా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్‌లు చేయడం ఇదే మొట్టమొదటిసారి. నిత్యం దేవుడ్ని కొలిచి, వేదపఠనాలు చదివే అర్చకులు వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రథయాత్ర జరుగుతున్న సమయంలో బ్రేక్ డ్యాన్స్‌లు చేసి విమర్శలపాలయ్యారు.