ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం

cellphone talking
ఎం| Last Updated: సోమవారం, 29 జులై 2019 (06:25 IST)
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఫోన్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని ప్రకటించిన ఆయన.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు గానూ తరగతి గదిలో టీచర్ల ఫోన్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై క్లాస్ రూంలో టీచర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు వినియోగించరాదని ఆదేశించారు. ఒకవేళ తరగతి గదిలో టీచర్ వద్ద మొబైల్ ఉన్నట్లు రుజువైతే సదరు ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనిపై మరింత చదవండి :