1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (08:39 IST)

వివేకా హత్య కేసులో కీలక మలుపు - వివేకా అల్లుడిని విచారించాలంటూ...

viveka deadbody
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరిగింది. ఈ కేసులో వివేకా అల్లుడుతో పాటు బావమరిది, టీడీపీ నేత బీటెక్ రవితో సహా మొత్తం ఆరుగురిని విచారించాలంటూ ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని కోర్టు విచారణకు స్వీకరించి ఆగస్టు 30వ తేదీకి వాయిదావేసింది. 
 
ఈ కేసులో టీడీపీ కీలక నేత బీటెక్ రవి, వివేకా కుమార్తె డాక్టర్ సునీత భర్త రాజశేఖర్, వివేకా బావమరిది శివప్రకాష్ కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లను సీబీఐ అధికారులు విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తులశమ్మ గత ఫిబ్రవరి 21వ తేదీన పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పులివెందుల కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. అలాగే, తులశమ్మ నుంచి పూర్తి వివరాలతో కూడిన వాంగ్మూలాన్ని సేకరించాలని కోర్టు ఆదేశించింది.