బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 13 ఆగస్టు 2020 (20:15 IST)

రఘురామక్రిష్ణరాజుకు కోపమొచ్చింది, నువ్వు సరిగ్గా నిలబడితే నా పొట్ట దగ్గరకు కూడా రావంటూ ఆగ్రహం

వైసిపిలో ఉంటూ ఆ పార్టీనే తిడుతున్న ఎంపి రఘురామక్రిష్ణమరాజు. ప్రతిరోజు వైసిపిని తిడుతూ ఉండడం ఈయనకు అలవాటుగా మారిపోయింది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదని.. సిఎం నిర్ణయాలన్నీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయంటూ రఘురామక్రిష్ణంరాజు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి రఘురామక్రిష్ణమరాజుపై తీవ్ర స్థాయిలో విమర్సలు చేశారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నాడు ఆయన. స్వపక్షంలో విపక్షమంటూ కొత్త పత్యానికి పరుగులు పెట్టి మాటతో సరిపెట్టుకునేదానికి వేటు దాకా తెచ్చుకున్న రాజుగారికి విగ్గు ఊడినట్లేనా.. విగ్గు ఊడిపోతే రేపటి నుంచి ఎలా తిరుగుతారో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశాడు.
 
ఈ కామెంట్ చూసిన రఘురామక్రిష్ణుంరాజుకు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ దేవేందర్ రెడ్డి నీలాగా నల్లగా వికారం ఉండాలని ఎవరూ అనుకోరు. నువ్వు సరిగ్గా నిలబడితే నా పొట్ట దగ్గరకు కూడా రావు. నీ సంస్కారం ఏంటో నువ్వు పంపిన భాషను బట్టే అర్థమవుతుంది.. నా బొచ్చుకు నీకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు రఘురామక్రిష్ణుంరాజు. అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే వుంటుందని గట్టిగా చెప్పుకొచ్చారు.