మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (19:37 IST)

రంజాన్ పండుకు మార్గదర్శకాలు రిలీజ్.. ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధం

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.  అయితే, కరోనా వైరస్ వ్యాప్తితో పాటు.. కరోనా కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్‌ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 
 
డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. సాధ్యమైనంత వరకూ ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు. ఒకవేళ మసీదుకు హాజరు అయితే మాత్రం 50 మందికి మించకూడదని అంజద్ బాషా వెల్లడించారు.
 
ఏపీ సర్కారు రిలీజ్ చేసిన రంజాన్ పండుగ మార్గదర్శకాలను ఓసారి పరిశీలిస్తే, బహిరంగ ప్రదేశాలు, ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధించారు. ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతించారు. 
 
ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. మసీదులో 50 మందికి మించి ప్రార్థనలకు హాజరు కావొద్దని హెచ్చించారు. ప్రార్థన సమయంలో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారు ప్రార్థనలకు వెళ్లకుండా చూడాలని కోరింది.