శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 12 మే 2021 (19:33 IST)

రుయా ఘటనలో చనిపోయిన మృతులు ఎంతమంది?

తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతుల సంఖ్య 11 మంది కాదు ఇంకా ఎక్కువగా ఉన్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణతో పాటు బిజెపి నేతలు ఆధారాలను చూపిస్తున్నారు. సిపిఐ నారాయణ మరణించిన వారి పేర్లను 23 మందిని చూపిస్తే బిజెపి నేతలు మొత్తం 18 మంది పేర్లను చూపించారు. అంతేకాదు 11మందికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
 
బిజెపి నేతలతో కలిసి మృతుల కుటుంబ సభ్యులు నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. బాధితుడు లబోదిబోమంటూ చనిపోయిన తన తండ్రి శవాన్ని అప్పగించిన ప్రతులను చూపించాడు. ఎక్స్‌గ్రేషియా తనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు.
 
అసలే తండ్రిని పోగొట్టుకుని బాధపడుతుంటే మొత్తం 11 మంది లిస్టులో తన తండ్రి పేరు లేదని కన్నీంటి పర్యంతమయ్యాడు. మృతుల సంఖ్యను చూపించడం ఇష్టం లేక ప్రభుత్వమే ఇలా చేసిందంటూ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు రుయా ఘటనలో ఎంతమంది మరణించారన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది.