గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 25 డిశెంబరు 2018 (11:15 IST)

జనసేన ఎదుగుదలను చూడలేక వర్మ కామెంట్స్: రావెల కిషోర్ బాబు

నేడు రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయింది..‌ ప్రాణం కోల్పోయే పరిస్థితి కి వచ్చిందని రాజకీయాలలో సరికొత్త మార్పును తెచ్చేందుకే పవన్ జనసేన స్థాపించారాన్నరు రావెల కిషోర్ బాబు. అందరికి సుపరిచితమైన గాజు గ్లాస్ పార్టి సింబల్‌గా రావడం ఆనందంగా ఉందని, జనసేనకు గాజు గ్లాసును కేటాయించిన ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 
ఈ గాజు గ్లాస్‌తో ప్రజలకు మరింత చేరువ అవుతాం అని, ఓట్ల కోసం ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసే పార్టీలను ప్రజలు తరిమికొడతారాన్నారు. ఇప్పటి‌వరకు పాలకుల కారణంగా ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్న ప్రజలు 2019 ఎన్నికలలో జనసేనకు అధికారం ఇస్తారనే నమ్మకం మాకు ఉందన్నారు.
 
జనసేన ఎదుగుదలను చూడలేక రాంగోపాల్ వర్మ వంటి‌వారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారని, 
నిర్మాణాత్మకంగా ఉండే సద్విమర్శలను స్వీకరిస్తాం కానీ రాజకీయంగా, కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేస్తే తిప్పికొడతాం అన్నారు. ఎవరైనా తమ ఆలోచనలు చెప్పాలనుకుంటే పవన్‌ను నేరుగా కలవవచ్చు. నీతివంతమైన, నిదర్శనమైన పాలనను పవన్ అందిస్తారు. చంద్రబాబు విడుదల చేసే శ్వేత పత్రానికి, ఆచరణకు ఎంతో వ్యత్యాసం ఉందని, పాలన పారదర్శకంగా ఉండాలే తప్ప, శ్వేత పత్రాలతో ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు.