గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (18:12 IST)

సచివాలయంలో మువ్వెన్నెల జెండా రెపరెపలు

సచివాలయం, జనవరి 26 : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రిపబ్లిక్ డే శుక్రవారం ఘనంగా జరిగింది. సచివాలయ సర్వీసెస్ విభాగం ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ దివ్వేది జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

సచివాలయం, జనవరి 26 : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రిపబ్లిక్ డే శుక్రవారం ఘనంగా జరిగింది. సచివాలయ సర్వీసెస్ విభాగం ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ దివ్వేది జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ చూపిన బాటలో అందరూ పయనించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు.
 
రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రదేశ్ పునాదుల స్థాయి నుంచి నిర్మించుకోవాల్సిన పరిస్థితుల ఏర్పడ్డాయన్నారు. ఉద్యోగులంతా కష్టించి పనిచేసి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. అంతకుముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ భద్రతాధికారి కె.కె.మూర్తి, పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.