బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (17:01 IST)

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనని చంద్రబాబు.. ఎందుకు...?

ఎన్ని పనులున్నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు పాల్గొనాలి. ఉదయం 7గంటలకే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనల

ఎన్ని పనులున్నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు పాల్గొనాలి. ఉదయం 7గంటలకే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. అందుకు ప్రధాన కారణం ఆయన దావోస్ పర్యటనలో ఉండడమే. 
 
ఇప్పటికే విదేశీ పర్యటనలలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమరావతి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో చివరకు చంద్రబాబు దావోస్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. సాయంత్రం తరువాత చంద్రబాబు అమరావతికి రానున్నారు.