ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం .. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు

currency
అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్రకు రెవెన్యూ లోటు భారీగా ఏర్పడిన విషయం తెల్సిందే. దీన్ని భర్తీ చేసే చర్యల్లో భాగంగా ఈ నిధులను దశల వారీగా విడుదల చేస్తుంది. 
 
మొత్తం 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో కలుపుకుని ఇప్పటివరకు ఏపీకి మొత్తం రూ.7032 కోట్ల నిధులు రెవెన్యూ లోటు కింద వచ్చాయి. 
 
దేశంలో రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో ఏపీ, అస్సోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌తో సహా మొత్తం 14 రాష్ట్రాలు ఉన్నాయి. 
 
ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు కింద మంగళవారం కేంద్రం రూ.7183 కోట్లను విడుదల చేయగా, వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఖజానాకు రూ.1132 కోట్లు వచ్చి చేరాయి.