సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (18:56 IST)

ఏపీలో భారీ వర్షపాతం-నవంబర్ 9న అల్పపీడనం

Rains
ఏపీలో భారీ వర్షపాతం నమోదైంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో నవంబర్ 9న ఈ అల్పపీడనం ఛాన్స్ ఉందని తెలిపింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ స్వల్పంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. 
 
ఇది పుదుచ్చేరి, చెన్నై మధ్య 11, 12న తీరం దాటే సూచనలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడు చెన్నైపైనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆంధ్రాపై స్పల్పంగా ఎఫెక్ట్ చూపనుంది. 
 
ఇక ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.