ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-11-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం..

మేషం :- ఉపాధ్యాయులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. విదేశీయానం, రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో స్త్రీలకు అసౌకర్యం, చికాకులు తప్పవు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. రుణాలు తీరుస్తారు.
 
వృషభం :- కొత్త ప్రదేశంలో ఆహారం, నీరు మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీంల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
 
మిథునం :- వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందు లెదుర్కుంటారు.
 
కర్కాటకం :- మీ మాటకు సంఘంలో గౌరవం లభిస్తుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. విద్యార్థులు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. పత్రిక, వార్తా సంస్థలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ స్థోమతకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందు లెదర్కుంటారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
సింహం :- ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. మీ హోదా చాటుకోవటానికి ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు.
 
కన్య :- వీలైనంత తక్కువగా మాట్లాడి ఎదుటివారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, అధికం. ఖర్చులు రాబడికి తగినట్టే ఉంటాయి. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది.
 
తుల :- దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుండి వ్యతిరేకత, ఆరోగ్యంలో చికాకులు అధికం కాగలవు. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ రాబడికి మించటం వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- వాహనం నిర్లక్ష్యంగా నడపటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారముంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, తోటివారితో ఇబ్బందులు తప్పవు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కొన్ని పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
ధనస్సు :- మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవటం మంచిది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు.
 
మకరం :- నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. ప్రయాణాల ముఖ్యోద్దేశ్యం నెరవేరుతుంది. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉపాధిపథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం :- నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. అనవసరపు విషయాలలో ఉద్రేకంమాని విజ్ఞతగా వ్యవహరిచండి. ప్రయాణాల్లో చికాకులు, అసౌకర్యానికి గురవుతారు. దూరప్రయాణాలు, షాపింగ్ లోను అప్రమత్తంగా వ్యవహరించండి.
 
మీనం :- ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. అధ్యాత్మిక, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు.