సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (21:01 IST)

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం .. ఏపీకి భారీ వర్ష సూచన

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ సూచన చేసింది. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని తెలిపింది. ఇది మరో రెండు రోజుల్లో అల్పపీడనంగా అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇది క్రమంగా వాయువ్య దిసగా పయనించి తమిళనాడు - పుదుచ్చేరి తీరాల మీదుగా వస్తుందని, దీని ప్రభావం కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర తీరంలో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.