గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

విజయవాడ ఎయిర్‌పోర్టులో హజ్ యాత్ర టెర్మినల్ : హజ్ కమిటి ఛైర్మన్ గౌసల్ ఆజామ్

aphajcommittee
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికి మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి ఛైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ చెప్పారు. వచ్చే సీజనులో హజ్ యాత్రికుల కోసం సౌకర్యాల కల్పన నిమిత్తం హజ్ కమిటి ప్రత్యేక అధికారి ఎల్.అబ్దుల్ ఖాదిర్‌తో కలిసి ముంబైలోని హజ్ కమిటి భారతదేశ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. 
 
హజ్ కమిటి ఆఫ్ ఇండియా సీఈవో యాఖుబ్ శాఖాను కలిశారు. హజ్ 2023కు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లగోరే యాత్రికులను విజయ వాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే  బయలుదేరే విధంగా ఎంబారిగేషన్ పాయింట్‌ను తిరిగి ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. యాత్రికులూ సౌదీ అరేబియాలో మక్కా, మదీనాలలో అక్కడ బసచేసే భవనాన్ని ఎంపిక చేసుకునేందుకు ఒక అధికారిని ముందుగా అక్కడకెళ్లి బస ఎర్పాట్లు చూసుకునేందుకుగానూ సౌదీ ప్రభుత్వ అనుమతి కోరాలన్నారు.
aphajcommittee
 
ఖాదిముల్ హజ్ వాలంటీర్ల ఎంపికలో హజ్ కమిటీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కూడ అవకాశం ఇప్పించాలని హజ్ కమిటి ఆఫ్ ఇండియా సీఈవో యాఖుబ్ ఖాన్ విన్నవించారు. ఈమేరకు అయనకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అంధ్రప్రదేశ్ హజ్ కమిటి వినతులను స్వీకరించిన అయన సానుకూలంగా స్పందించారని గౌసల్ ఆజామ్ వెల్లడించారు.