1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (21:05 IST)

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత..

bhageeratha reddy
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన భగీరథ బుధవారం చికిత్స ఫలించక కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు వైకాపా ధ్రువీకరించింది. 
 
చల్లా భగీరథ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 46 ఏళ్ల వయసుకే ఆయన ఈ లోకాన్ని విడవడం పట్ల వైసీపీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
భగీరథ రెడ్డి అంత్యక్రియలు రేపు (నవంబరు 3) కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. చల్లా భగీరథ రెడ్డి దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు కావడం గమనార్హం.