శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (16:00 IST)

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆటోను జీపును ఢీకొట్టింది.
 
జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేప్టటారు. క్షతగాత్రులను రాయదుర్గం దవాఖానకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.