శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 జులై 2023 (14:54 IST)

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురి దుర్మరణం

road accident
తిరుపతి జిల్లా శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాళహస్తికి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద కారు, లారీలు ఢీక్కొన్నాయి. విజయవాడ నంచి శ్రీకాళహస్తికి ఇన్నోవా కారులో బయలుదేరి వెళుతుండగా, శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీ ఒకటి అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. 
 
ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆయన్ను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.