1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ధూలో ఘోరం.. దూసుకొచ్చిన ట్రక్... పది మంది మృత్యువాత

road accident
మహారాష్ట్రలోని ధూలేలో ఘోరం జరిగింది. ఒక భారీ కంటైనర్ ఒకటి ఒక్కసారిగా దూసుకుని రావడంతో పది మంది మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న వాహనాలను వరుసగా ఢీకొడుతూ కంటైనర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోయారు. మరో 20 మంది వరకు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ధూలేలోని పలాస్నేర్ గ్రామ సమీపంలో హైవేపై వెళుతున్న కంటైనర్ లారీ ఈ నాలుగు వాహనాలను ఢీకొని ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ధూలేలోని ముంబై - ఆగ్రా జాతీయ రహదారిపై పలాస్నేర్ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు.