సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (15:09 IST)

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ దుర్మరణం

road accident
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ హాస్య నటుడు, యూట్యూబర్ దేవరాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగులో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
ఈ కమెడియన్ మృతిపట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం తెలిపారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ దిల్ సే బురా లగ్తా హై చిత్రంతో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈ రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగా, అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.