శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (13:20 IST)

మాలీవుడ్‌లో విషాదం... రోడ్డు ప్రమాదంలో నటుడు దుర్మరణం

mimicry artist sudhi
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఓ రోడ్డు ప్రమాదంలో నటుడు కొల్లం సుధి (39) దుర్మరణం పాలయ్యారు. కేరళలోని కైపమంగళం వద్ద సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ బిను అడిమాలు, ఉల్లాస్, మహేశ్‌లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
వటకరలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుధి తలకు బలమైన గాయం తగలడంతో ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుధి మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
గత 2015లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన సుధి... పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. సుధి మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. ఆయన మృతిపట్ల పలువురు నటీనటులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపుతున్నారు.