గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

నలుగురు పిల్లల్ని స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసిన తల్లి.. ఆపై ఆత్మహత్య

suicide
భార్యాభర్తల మధ్య గొడవలు నలుగురు పిల్లలతో పాటు భార్య ప్రాణాలు కూడా పోయాయి. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్‌ జిల్లాలో జరిగింది. భర్తపై ఉన్న కోపంతో నలుగురు పిల్లలను కన్నతల్లి ఓ స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసింది. దీంతో వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ జిల్లాకు చెందిన 27 యేళ్ల వ్యక్తి మైనింగ్ కార్మికుడిగా పని చేస్తుండగా, ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విరక్తి చెందిన వివాహిత నలుగురు పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఐద మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడివుంటుందని స్థానికులతో పాటు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్నారు.