1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (16:28 IST)

ప్రతి ఇంటికీ 100 యూనిట్ల ఉచిత విద్యుత్.. : సీఎం అశోక్ గెహ్లాట్

ashok gehlot
రాజస్థాన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికీ వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. అయితే, వంద యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీని మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచే అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
 
ఈ కొత్త జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు ప్రతినెలా వంద యూనిట్ల విద్యుత్‌ను వినియోగించేవారి బిల్లు జీరో అవుతుంది. వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఖర్చు చేసే కుటుంబాలు వంద యూనిట్ల రాయితీని కూడా పొందుతారు. 
 
అంటే 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉపయోగించినా వంద యూనిట్ల బిల్లు ఉచితంగానే ఉంటుంది తెలిపారు. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల శ్లాబ్‌ల వారీ మినహాయింపును మార్చాలని ఉన్నతాధికారులకు సూచన చేసినట్టు గెహ్లాట్ తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరికీ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను బహుమతిగా ఇవ్వనుంది.