సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి సజీవ దహనం

fire
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన శైలేష్ పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. అక్కడ బయోమెడికల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు.
 
శనివారం శైలేశ్ కారులో వెళుతుండగా న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శైలేశ్ కారుకు ఎదురు నుంచి వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొంది. దీంతో, శైలేశ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. 
 
అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి గుర్రపు శైలేశ్(25) దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన శైలేశ్ పైచదువుల కోసం అమెరికాకు వెళ్లారు. 
 
అక్కడ బయోమెడికల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. శైలేశ్ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.