గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:20 IST)

విజయవాడ సింగ్ ఫ్లైఓవర్‌పౌ ఆటో - ఆర్టీసీ బస్సు ఢీ

road accident
విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వంతెనపై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడింది. అలాగే, ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఆటో డ్రైవర్‌కు గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 
 
ఈ ప్రమాదంపై తక్షణం స్పందించిన పోలీసులు గాయపడిన ఆటో డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే, స్తంభించిన పోయిన వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.