Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రారంభ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నఎమ్మెల్యే రోజా

Updated: బుధవారం, 28 జులై 2021 (15:05 IST)
చాలా రోజుల త‌ర్వాత ఎమ్మెల్యే రోజా త‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వడమాలపేట మండలం పూడిలో 21 లక్షల రూపాయలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రానికి ఆమె శంకుస్తాప‌న చేశారు. అలాగే, 17.50 లక్షలతో నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ రెండింటికీ క‌లిపి  నిర్మించనున్న కాంపౌండ్ వాల్ కు ఎమ్మెల్యే ఆర్కే రోజా భూమి పూజ చేశారు. సచివాలయం భవనంలో 2.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బోరు మోటారు పనుల‌ను రోజా స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేసారు. అస‌లే అస‌మ్మ‌తి సెగ‌తో ర‌గిలిపోతున్న న‌గ‌రి నియోజ‌క‌వర్గంలో మ‌ళ్లీ రోజా త‌న హవా కొన‌సాగిస్తున్నార‌ని ఆమె అనుచ‌రులు చెప్పారు.

ఎమ్మెల్యే నిరంత‌రం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పైనే ఆలోచిస్తార‌ని, త‌న వెనుక నుంచి కుయుక్తులు ప‌న్నే వారిని రోజా ప‌ట్టించుకోర‌ని చెపుతున్నారు. ఎమ్మెల్యే రోజాకు వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వి ఖాయం అని పేర్కొంటున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments