శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2020 (20:08 IST)

స్విమ్స్ మృతురాలు రాధికా కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం: మంత్రి ఆళ్ల నాని

తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లోని కోవిడ్ సెంటర్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధికా అనే అటెండర్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాధికా కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ఇస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.
 
గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. రాధికా మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాధికా భర్త కూడా స్విమ్స్ లోనే 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వీరి ఇద్దరి కుమారులు వారం వ్యవధిలో తీవ్రమైన జ్వరంతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంతో మినిగిపోయింది.
 
ఇప్పుడు ఆమె మళ్లీ గర్భం దాల్చడంతో ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరం. ఆమె భర్త హరి పరిస్థితి దారుణంగా ఉంది. సర్వస్వాన్ని కోల్పోయానంటూ ఆయన రోదిస్తున్నారు.