సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (18:41 IST)

నారా లోకేష్‌తో కరచాలనం.. ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం గోవిందా!

nara lokesh
యువగళం పాదయాత్రలో  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరచాలనం చేసిన ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై నారా లోకేష్ ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ ఘటనపై నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో తనకు కరచాలనం చేసి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మొబైల్ కవర్‌ను ప్రదర్శించి మద్దతు తెలిపినందుకు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని తెలిపారు. 
 
డ్రైవర్ తన అభిమానాన్ని మాత్రమే చాటుకుంటున్నాడని, ఏం నేరం చేశాడని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకు అని ప్రశ్నించారు.