12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాలు

srisailam temple
ఎం| Last Updated: సోమవారం, 6 జనవరి 2020 (17:54 IST)
సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవాలయంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు సాగుతున్న సమయాల్లో
ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
దీనిపై మరింత చదవండి :