శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:45 IST)

24 నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 24వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శన (ఉచిత) టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని ఈ నెల 25 నుంచి జనవరి మూడో తేదీవరకు తెరిచి ఉంచి.. భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తామన్నారు.

ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామన్నారు. అలాగే రోజుకు 10వేల చొప్పున పది రోజులకు లక్ష సర్వదర్శన టోకెన్లను తిరుపతిలోని ఐదు ప్రదేశాల్లో భక్తులకు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు.