విష్ణునివాసంలోనూ సర్వదర్శనం టోకెన్ల జారీ
భక్తుల ఆరోగ్య భద్రత, సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి విష్ణునివాసం కాంప్లెక్స్‌లోనూ సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టైంస్లాట్ ( ఉచిత దర్శనం) టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.
రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే యాత్రికులు విష్ణునివాసంలోని టోకెన్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. దర్శనానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టు భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరింది.