1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (22:38 IST)

రవాణాశాఖ టెక్నికల్ అధికారుల నూతన కార్యవర్గం

అత్యంత కీలకమైన టెక్నికల్ అధికారులు పారదర్శకమైన సేవలందించి ప్రజల మన్ననలను పొంది రవాణా శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని రవాణా శాఖ అదనపు కమీషనర్ ఎస్ .ఎ.వి. ప్రసాదరావు తెలిపారు.

రవాణా శాఖ టెక్నికల్ అధికారుల సంఘం రాష్ట్ర సంఘ ఎన్నికలు విజయవాడలోని ఎపి ఎన్ జి ఓ  హెం సందు ఆదివారం నాడు నిర్వహించారు . అనంతరం  నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరైన  రవాణాశాఖ రాష్ట్ర అదనపు కమీషనర్ ఎస్ ఎ వి ప్రసాదరావు మాట్లాడుతూ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) దృష్టికి తీసుకు వచ్చిన సమస్యను వెనువెంటనే పరిష్కరిస్తున్నారని, సానుకూల దృక్పథంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే మంత్రి దొరకటం ఉద్యోగుల అదృష్టంగా భావించాలన్నారు.

ప్రభుత్వ పాలసీలకు విరుద్దంగా ఉద్యోగులు అధికారులు ఏ విధమైన చర్యలకు పాల్పడరాదన్నారు  . పారదర్శకంగా పనిచేసే ప్రతి ఒక్కరికి ఉన్నత అధికారుల దృష్టిలో అత్యంత ప్రాధాన్యత లభిస్తుందన్నారు . తమ పరిధిలో లేని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

టెక్నికల్ అధికారులు రవాణా శాఖకు గుర్తింపు తేవాలని ఆకాంక్షిస్తూ మంత్రి వర్యులు, ఉన్నతాధికారులు పక్షాన నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియచేస్తున్నామన్నారు .

ఎపి ఎన్జిఓస్  రాష్ట్ర అధ్యక్షులు జె.ఎ.సి ఛైర్మన్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ , రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలలో అత్యంత కీలకమైనది రవాణా శాఖ అని అన్నారు . ఉద్యోగులు సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించేందుకు ఎపి.ఎన్ జి ఓ అసోసియేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని రవాణా శాఖ అధికారులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర జెఎసి ద్వారా సంబంధిత మంత్రివర్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు.

ఎపి ఎన్ జీ ఓ పశ్చిమకృష్ణ, జిల్లా అధ్యక్షులు ఎ . విద్యాసాగర్ మాట్లాడుతూ రవాణా శాఖ ఉద్యోగులతో తనకు దాదాపు 25 ఏళ్ళ అనుబంధం ఉందని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించటంలో ఎపి ఎన్ జి ఓస్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో రవాణా శాఖ ఉద్యోగులు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరుగుతుందన్నారు.

ఇదే స్ఫూర్తితో రాష్ట్ర సంఘానికి సంపూర్ణ సహకారాలు అందించాలని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘం ముందుండాలని కోరారు . నూతనంగా ఎన్నికైన రాష్ట్ర సంఘ అధ్యక్షులు కె.సీతారామిరెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ అధికారుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సంఘం పని చేస్తుందన్నారు. టెక్నికల్ అధికారులు మరింత బాధ్యతా యుతమైన సేవలు అందించేందుకు సిద్ధంగా వున్నారని తెలిపారు.

టెక్నికల్ అధికారులపై నమోదైన ఎసిబి కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. విఐపి కాన్వాయ్ వెహికల్స్ ను ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీని నియమించాలని కోరుతున్నామన్నారు. ఎంతో కాలంగా టెక్నికల్ అధికారులు పదోన్నతలు లేక నిరుత్సాహానికి గురి అవుతున్నారని వెంటనే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని నూతన పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ప్రస్తుతం ఆన్ లైన్ ప్రక్రియ వలన వాహన రిజిస్ట్రేషన్ నిర్వహణలో ఫేక్ డాక్యుమెంట్లను సమర్పించే అవకాశం వుందని ఇటువంటి వాటికి టెక్నికల్ అధికారులను బాధ్యులను చేయటం సమంజసం కాదని ఫేక్ డాక్యుమెంట్లకు వాహన యజమానులనే బాధ్యులను చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు . మార్కెట్లో నానాటికీ అనేక నూతన మోడల్స్ లో వాహనాలను ప్రవేశ పెడుతున్నారని వాటిని తనిఖీ చేసేందుకు టెక్నికల్ అధికారులకు అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తున్నామన్నారు.

రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎల్.ఎస్.ఎం. రమశ్రీ , ఎస్ , వెంకటేశ్వరరావు , డిటిసిలు ఇ మీరాప్రసాద్ , ఎం . పురేంద్ర, మాజీ అధ్యక్షులు కె.వి. సుబ్బారావు, నూకరాజు, జె.రాజారావు, ఎస్ సిఎసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆర్. సురేష్, రవాణాశాఖ నాన్ టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి మణి కుమార్, జోనల్ అధ్యక్షులు ఎం.రాజుబాబు రవాణా శాఖ అధికారులు , ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు . 
 
టెక్నికల్ అధికారుల రాష్ట్ర సంఘానికి ఎన్నికైన నూతన కార్యవర్గం : 
విజయవాడలోని ఎపి ఎన్ జీ ఓ హెంలో జరిగిన రవాణా శాఖ టెక్నికల్ అధికారుల రాష్ట్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కె.సీతారామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.విజయరాజు, కోశాధికారిగా సి.హెచ్. రాంబాబు, సహ అధ్యక్షులుగా టి.డి. ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జి . సత్యం నాయుడు, ఎండి సిద్దిక్ , ఎన్ . శివనాగేశ్వరరావు, డి.ఎస్.ఎమ్ . వరప్రసాద్ . కార్యనిర్వహక కార్యదర్శులుగా జె . రమేష్ కుమార్ , ఆర్ ఎం . బాలమురళీకృష్ణ , సి. వాసుదేవ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా, వి.వెంకటరావు, బి.చల్లారావు, వి.మధుసూధన్, కె.అతిక నాజ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యం డి. ఇక్బాల్, సహాయ ఎన్నికల అధికారిగా బి.రాజశేఖర్, ఎన్నికల పర్యవేక్షకులుగా డి.మణికుమార్  వ్యవహరించారు.