గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (09:59 IST)

అంతర్వేది, కన్యాకుమారి సముద్రతీరాల్లో 2 కిలోమీటర్లు వెనక్కి సముద్రుడు

బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు.

స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కాగా.. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయపెడుతున్నాయి.
 
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం వింత పరిస్థితి నెలకొంది. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా.. కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది.

తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. 

గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం .. గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కన్యాకుమారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.