సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

ప్రియుడికి ఎయిడ్స్.. అయినా పర్లేదు.. అతడినే పెళ్లి చేసుకుంటా..?

ఆధునికత పోకడలు వెల్లువెత్తినా.. ఇంకా ప్రేమ చావలేదు. ప్రేమ, ఆప్యాయతలు మెల్లమెల్లగా కనుమరుగవుతున్న తరుణంలోనూ ప్రేమ జీవించి వుంది. తాజాగా ప్రియుడికి ఎయిడ్స్‌ నిర్ధారణ అయినా అతనితోనే జీవించాలని నిర్ణయించుకున్న ప్రియురాలు వివాహం చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కన్నియకుమారి జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక నాగర్‌కోయిల్‌లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువు తోంది. రెండు రోజులుగా కుమార్తె అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు నాగర్‌కోయిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు విచారణలో, అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్‌ను ఆ బాలిక ప్రేమించినట్లు తెలిసింది. వీరిద్దరు తల్లిదండ్రులకు తెలియకుండా కోవైలోని స్నేహితుల వద్దకు వెళ్లినట్లు తెలిసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్‌కు ఎయిడ్స్‌ వ్యాధి సోకినట్లు కూడా విచారణలో తేలింది. 
 
దీంతో, కోవైకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడికి ఎయిడ్స్‌ ఉన్న విషయం తెలిసినా, అతనిని వివాహం చేసుకున్నట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కాగా, బాలిక మైనర్‌ కావడంతో, ఈ వ్యవహారంపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. 
 
అతని అరెస్ట్‌ చేయడాన్ని అడ్డుకున్న బాలిక తనను అరెస్ట్‌ చేయాలని రోడ్డుపై భైఠాయించింది. ఆమెకు కూడా ఎయిడ్స్‌ వ్యాధి సోకిందేమోనని పోలీసులు, ఆమెను పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.