మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 20 జనవరి 2021 (22:58 IST)

జబర్దస్త్ ప్రేమికులు.. చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారహో..!

జబర్దస్త్ కామెడీ షో.. తెలుగు టెలివిజన్ చరిత్రలో సూపర్బ్ కామెడీ షోగా అవతరించిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్ళుగా అదే రేటింగులతో దూసుకుపోతోంది. ఈ షోతో ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. చాలామంది ఆర్టిస్టులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. 
 
అయితే జబర్దస్త్ షో అంటే మెయిన్‌గా రోజా, అనసూయలతో పాటు రష్మి, సుధీర్ లవ్ ట్రాక్ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. వారిద్దరి వల్ల కూడా షోను ఇంట్రస్ట్‌గా చూస్తారు. కొన్ని పంచ్‌లు కూడా వారిపైన నడుస్తూ ఉంటాయి. తాజాగా జబర్దస్త్‌లో మరో లవ్ ట్రాక్ మొదలైంది.
 
ఈ మధ్యకాలంలో అదే కామెడీతో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న ఇమ్యానుయేల్ ఇటీవల ఫేమస్ అయిన వర్ష మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందన్న ప్రచారం బాగానే ఉంది. డిసెంబర్ 11వ తేదీన ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య ప్రేమను కన్ఫామ్ చేసేసింది. 
 
ఇద్దరు ఒకరిపై ఒకరు తమకున్న ఇష్టాన్ని వ్యక్తపరుచుకున్నారు. ఇమ్యానుయేల్ నల్లగా ఉంటే ఏంటి మంచి మనస్సుండాలి చెప్పుకొచ్చింది హర్ష. ఇద్దరి మధ్యా ఆ ట్రాక్ కాస్త ప్రస్తుతం నడుస్తూనే ఉందట. షోలో ఖాళీ దొరికితే చాలు ఇద్దరూ తెగ మాట్లాడేసుకుంటున్నారట. అంతేకాకుండా ఖాళీ సమయాల్లో ఇద్దరి కలిసి బయట ప్రేమ పక్షుల్లా తిరిగేస్తున్నారట.