గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (15:43 IST)

అవినాష్.. అరియానాల పెళ్లి.. జోరుగా ప్రచారం..

Avinash_Ariyana
జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. 30 ఏళ్ల అవినాష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. బిగ్ బాస్ 4 ఫినాలే స్టేజీపై తాను త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు చెప్పాడు. ఏడేళ్లుగా జబర్దస్త్‌లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. బిగ్‌బాస్‌లోకి వెళ్లి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు.
 
ఈయన బిగ్ బాస్ నుంచి దాదాపు 40 లక్షల వరకు సంపాదించుకున్నాడని తెలుస్తుంది. 2021 సమ్మర్‌లో తాను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పేసాడు అవినాష్. ఈయన నమ్మకం చూస్తుంటే ఇప్పటికే అమ్మాయిని కూడా చూసుకున్నాడేమో అనిపిస్తుంది. కొందరు అయితే ఏకంగా అరియానానే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
 
బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు అందరికంటే ఎక్కువగా అరియానాతోనే ఉన్నాడు అవినాష్. ఆమె ఒక్క క్షణం కనిపించకపోతే పిచ్చెక్కిపోయాడు. అరియానా కూడా అంతే. అవినాష్ కంటే తనకు ఎవరూ ఎక్కువ కాదని చాలాసార్లు చెప్పింది. బయటికి వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడాలి నీతో అంటూ అప్పట్లో చెప్పింది కూడా. దాంతో ఇప్పుడు అవినాష్ చూసుకున్న అమ్మాయి అరియానానే అనే వార్తలు కూడా వస్తున్నాయి. 
 
ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు.. ఇంతమంచి అనుబంధాన్ని పెళ్లిగా మార్చుకుంటే తప్పేంటి అనే వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా అవినాష్ పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్తేస్తే ఓ పనైపోతుంది.