సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (11:17 IST)

ప్రియుడుతో ఎంజాయ్ చేయలేకపోతున్నానని భర్తను చంపేసింది..

ప్రియుడుతో ఎంజాయ్ చేయలేకపోతున్నానని మనోవేదనకు గురైన ఓ వివాహిత.. కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా (30) అనే వ్యక్తికి భార్య కుష్బుదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేండ్ల క్రితం నగరానికి వలస వచ్చి సోమాజిగూడ డివిజన్‌, రాజ్‌నగర్‌ మక్తాలో ఉంటున్నారు. 
 
లక్ష్మణ్‌ రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే.. ఉదయం జ్యూస్‌ షాపును నడుపుతున్నాడు. ఏడాది క్రితం సహాయకుడిగా దూరపు బంధువైన ఖైరతాబాద్‌లో నివాసం ఉండే లాల్‌ బాబు‌ను పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కుష్బుకు.. లాల్‌ బాబుతో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
వివాహేతర సంబంధానికి లక్ష్మణ్‌ అడ్డుగా ఉన్నాడని.. అతడిని అడ్డు తొలగించుకోవానుకున్నది. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్‌ జా పడుకోగా..  కుష్బు ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి, చున్నీతో ఉరివేసి హతమర్చాడు. అనంతరం ఖైరతాబాద్‌లో నివాసం ఉండే మృతుడి సోదరుడు బీహారీ జాకు ఫోన్‌ చేసి లక్ష్మణ్‌ నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. 
 
అతడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో అది హత్య అని తేలింది. కుష్బును అదుపులోకి తీసుకుని విచారించగా తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.