శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (10:54 IST)

దొరైస్వామికి రాజమౌళి నివాళి.. కన్నీటి పర్యంతమైన జక్కన్న

Rajamouli
సీనియర్ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ వి దొరైస్వామి పార్థివదేహానికి ఎస్ ఎస్ రాజమౌళి నివాళిలు అర్పించారు. సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం 7 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకు వచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, కీరవాణి ఫిలింఛాంబర్ కు వచ్చి దొరస్వామిరాజు మృతదేహాం వద్ద నివాళులు అర్పించారు. 
 
నిర్మాత సి. అశ్వనీదత్, రాశి మూవీస్ నరసింహారావు, ఎం.ఎల్. కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు వచ్చి నివాళులు అర్పించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. తరువాత 11 గంటలకు ఫిల్మ్ నగర్ లో ఉన్న మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి. కాగా ఎస్ ఎస్ రాజమౌళి అండ్ ఎన్టీఆర్ కాంబో లో తెరకెక్కిన సింహాద్రి సినిమాను వి దొరైస్వామి నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. 
 
ఈ సందర్భంగా రాజమౌళి ఆ సినిమా తాలూకా రోజులు మరియు దొరైస్వామి తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతం అయ్యారు. అక్కడి వారికి కూడా కళ్ళు చెమర్చాయి. వెంటనే ఆయన RRR.. షూటింగ్ కోసం ఫిల్మ్ సిటీ వెళ్లారు. దొరస్వామి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో 12 గంటలకు జరగనున్నాయి.