శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (16:52 IST)

రూ.5 వేల కోసం ఫ్రెండ్‌ను చంపేశాడు.. ఎక్కడ?

సికింద్రాబాద్ నగరంలో కేవలం ఐదు వేల రూపాయల కోసం ఒక యువకుడు తన ఫ్రెండ్‌ను అత్యంత పాశవికంగా చంపేశాడు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బోయిన్‌పల్లి చిన్నతోకట్ట అనే ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (27), వికాస్ తివారి (24) అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిలో వికాస్ వద్ద అజయ్ కుమార్ రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తిరిగి ఇవ్వలేదు. అయితే, తన అప్పు చెల్లించాలని ఈనెల 14వ తేదీన అజయ్‌ ఇంటికి వికాస్ వెళ్ళాడు.
 
ఆ తర్వాత వారిద్దరూ కలిసి అర్థరాత్రి వరకు మద్యం సేవించారు. అపుడు కూడా అజయ్‌ను డబ్బులు ఇవ్వాలని వికాస్ కోరాడు. దీంతో ఆగ్రహించిన అజయ్... క్షణికావేశంలో వికాస్ తలపై బండరాయితో మోదాడు. ఆ తర్వాత మృతుని సెల్‌ఫోన్ తీసుకుని ఢిల్లీకి పారిపోయాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కానీ పోలీసులకు ఎలాంటి ఆధారం చిక్కలేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన అజయ్... అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.