మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (12:20 IST)

సైకో కిల్లర్.. ఆరు నెలల్లో 10మందిని హత్య చేశాడు.. కుంభమేళాలో అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లో ఆరు నెలల్లో 10 మంది హత్య చేసిన సీరియల్ సైకో కిల్లర్‌‌ను అలహాబాద్ కుంభమేళాలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, అలహాబాద్ నగరంలో.. ఫుట్‌పాత్‌లో నిద్రించే వారు.. గత జనవరి పదో తేదీ దారుణంగా హత్యకు గురైయ్యారు. 
 
పదునైన ఆయుధంతో గొంతుకోసిన స్థితిలో హత్యకు గురయ్యారు. ఇదేవిధంగా 18వ తేదీ కూడా ఫుట్‌పాత్‌లో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇటీవల కుంభమేళా ప్రాంతంలో రాత్రి పూట ఒకరు హత్యకు గురయ్యారు. ఇలా వరుస హత్యలకు కారణమైన కిల్లర్ గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో సైకో కిల్లర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు 10 మందిని ఈ సైకో కిల్లర్ హత్య చేశాడు.