మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:57 IST)

వేరొక మహిళతో వివాహేతర సంబంధం.. భర్తను చితకబాదిన భార్య..

టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. అందుకు తోడుగా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు కూడా మంటగలిసిపోతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో తనను కాదని.. వేరొక మహిళతో వివాహేతర సంబంధం నెరపిన భర్తను ఓ మహిళ చితకబాదింది. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ అల్వాల్ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి గోపాల్ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ భార్య ఎస్తర్ ఏంజెల్ తన బంధువులతో కలిసి వచ్చి అతన్ని పట్టుకుని చితకబాదింది.
 
గోపాల్, ఎస్తర్‌లకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్ని రోజులుగా గోపాల్ కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో అనుమానంతో భార్య ఆరా తీసింది. చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి గోపాల్‌ను చితకబాదింది.