మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (18:34 IST)

మహిళల కోసం మంచి నిర్ణయాలు... వాసిరెడ్డి పద్మ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్రమహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ... "ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు కేబినెట్ హోదా ఇవ్వడం సంతోషం. ఇప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీడియాకు చేరువయ్యాను.
 
 ముఖ్యమంత్రి మహిళల కోసం అనేక మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నవరత్నాలలో కూడా మహిళలకు పెద్ద పీఠ వేస్తున్నారు. మధ్య నిషేదం అనేది మహిళలు జీవితాలలో పెను మార్పు తీసుకొని రాబోతోంది. ప్రతి ఇంటిలో కూడా మహిళల గురుంచి ఆందోళన చెందుతున్నారు. మహిళా కమిషన్ అనేది మగవారికి వ్యతిరేకము కాదు. 
 
డ్వాక్రా మహిళలు ఆర్ధికముగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం పని చేస్తుంది. గతంలో జరిగిన తప్పుల వలన మహిళలు అప్పుల్లో కూరుకుపోయారు. మహిళల పట్ల చిన్న చూపు, వివక్షత బాగా పెరిగిపోయింది. ఆడ, మగ సమానం అనే భావన ఏర్పడేందుకు కృషి చేయాల. దీనిపై పిల్లలకు ప్రత్యేక తరగతులు చెప్పాలి. 
 
సమాజంలో మహిళలపై నేరాలకు సంబంధించిన విషయాలు గురించి చూస్తే మనం ఎటు పోతున్నామో అర్థం కావడం లేదు. ఇది దురదృష్టం. మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ముందుకు వెళతాము. మగ, ఆడ కలిసి సామరస్యంగా కలిసి వెళ్లే దానికి ఈ కమిషన్ పని చేస్తోంది" అని పేర్కొన్నారు.