సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (09:03 IST)

'సైకో' శ్రీనివాస రెడ్డి నేర చరిత్ర ఇదీ... వెలుగులోకి విస్తుపోయే నిజాలు

తెలంగాణా రాష్ట్రంలోని హజీపూర్‌లో వెలుగులోకి వచ్చిన సైకో శ్రీనివాస రెడ్డి వరుస హత్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టింటాయి. అంతేకాకుండా, గతంలో అతను చేసిన నేరాలు, ఘోరాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
హజీపూర్ వరుస హత్యల కేసులో అరెస్టు చేసిన శ్రీనివాస రెడ్డిని సరూర్‌నగర్ ఎస్‌ఒటి కార్యాలయంలో రెండో రోజు కూడా సిట్ పోలీసుల బృందం విచారణ జరిపింది. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. రెండు రోజులుగా శ్రావణి, కల్పన, మనీషాలతో దారుణ ఘటనలపై దర్యా ప్తు చేపడుతున్న పోలీసులు శ్రీనివాసరెడ్డిలో శాడిస్టు లక్షణాలున్నట్లు గుర్తించినట్లు సమాచారం. 
 
శ్రావణి, కల్పన, మనీషాలతో పాటు శ్రీనివాస్ మరికొంత మందిని మట్టుబెట్టినట్లు వచ్చిన ఆ రోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి క్రైం రికార్డులను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను, స్నేహితులను సిట్ బృందం విచారిస్తోంది. చిన్నారుల దారుణ ఘటనలలో శ్రీనివాస్‌ రెడ్డికి ఎవరైనా సహకరించారా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. 
 
ముఖ్యంగా శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా పలువురికి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి తల్లి, సోదరుడు, స్నేహితులను పోలీసులు విచారించారు. సిట్ విచారణలో శ్రీనివాస రెడ్డి కుటింబీకులు అందించిన సమాచారంతో పలు అసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 
 
హాజీపూర్ గ్రామంలో నివాసముంటున్న కీచకుడు శ్రీనివాస రెడ్డికి ఎలాంటి గుర్తింపు కార్డు లేదని, ఆపై ఆధార్‌ కార్డు కూడా లేదని అతని సోదరుడు వెల్లడించాడు. అదేవిధంగా ఓటరు కార్డు కూడా శ్రీనివాస రెడ్డికి లేదని పోలీసులు విచారణలో వెలుగుచూసింది. తాను చేసే దారుణాలకు ఎలాంటి ఆధారాలు దొరకూడదన్న ఉద్దేశ్యంతో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
శ్రీనివాసరెడ్డి ఊరి శివారులో ఇళ్లు కట్టుకుని గ్రామంలోకి రాకపోకలు సాగించే వారిపై కన్నేసి, వారిని కాటేసేవాడని విచారణలో తేలింది. హాజీపూర్‌లో ఉంటున్నట్లు ఎవరికి తెలియకుండా జాగ్రత్తలతో పాటు ఏలాంటి ఆధారాలు లేకుండా ముందస్తుగానే శ్రీనివాసరెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
శ్రీనివాసరెడ్డి తన సోదరికి వివాహం చేసి, ఆ తర్వాత తాను కూడా వేములవాడలోని ఓ యువతిని పెళ్లి చేసుకున్నట్టు తేలింది. శ్రీనివాస రెడ్డికి 28సంవత్సరాలు దాటినప్పటికీ వివాహం కాకపోవడం, గంజాయికి అలవాటు పడటం, ఆపై తరచూ పోర్న్ వెబ్‌సైట్లు చూడటంతో చిన్నారులపై కన్నేసేవాడని, ఊరిలో ఎవ్వరితోనూ మాట్లాడడని, ఒక సైకోలాగా మారాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బొమ్మల రామారంలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడడటం తో గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చావగొట్టిన వివరాలను సేకరించారు.
 
కర్నూలు, వరంగల్ జిల్లాలోనూ ఒక రేప్ కేసు, ఒక బైక్ దొంగతనం కేసులు ఉండగా, వీటిపై విచారణ చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు నగరంలో ఒక యువతిని అత్యాచారం ఆపై హత్య కేసులో శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్న నిందితులను అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. పలు కేసులలో జైలుకు వెళ్లిన శ్రీనివాసరెడ్డి జైలు స్నేహితులను సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది.