బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (16:08 IST)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

Chintamaneni Prabhakar
Chintamaneni Prabhakar
రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఏదైనా కార్యక్రమంలో హాజరైతే వారిని శాలువాలతో, పుష్ప గుచ్ఛాలతో సత్కరిస్తారు. ఈ శాలువాలను చాలాసార్లు పక్కన పెడతారు. తిరిగి ఉపయోగించరు. అయితే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన బృందం ఈ శాలువాలను ఒక గొప్ప పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. 
 
సత్కారం ద్వారా లభించే శాలువాలను దుస్తులుగా మార్చి, పేద, అనాథ బాలికలకు బహుమతిగా ఇచ్చారు. దీనిపై చింతమనేని మాట్లాడుతూ.. "మేము ది గివ్ బ్యాక్ చొరవను ప్రారంభించాం, ఇది ప్రతి ఈవెంట్ నుండి నేను అందుకునే శాలువాలతో చిన్నారులకు దుస్తులు అందిస్తుంది. మేము ప్రతి డ్రెస్ కోసం రూ. 450 పెట్టుబడి పెట్టాము. 250 మంది యువతులకు దుస్తులు తయారు చేసాం. తరచుగా సత్కారాలు పొందే వ్యక్తులు ఆ శాలువాలను ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. తద్వారా పేద పిల్లలు ప్రయోజనం పొందుతారు. ఈ క్రిస్మస్ ముందు పిల్లలకు ఈ దుస్తులను పంపిణీ చేయడమే మా లక్ష్యం.." అని చెప్పారు. 
 
ఈ దుస్తులను పిల్లలకు వారి పుట్టినరోజుల నాడు కూడా పంపిణీ చేయాలని, వారి పేర్లను ముద్రించి ఇవ్వాలని   యోచిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని బృందం తెలిపింది. కాగా నెటిజన్లు చింతమనేని ఈ గొప్ప చొరవను అభినందిస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు కూడా అదే మార్గాన్ని అనుసరించాలని కోరుతున్నారు.